జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించడానికి సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. 

New Update
Jubilee hills Election

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించడానికి సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. 

ఏ డివిజన్ కు ఎవరు ఇన్ఛార్జి అంటే..

యూసఫ్ గూడ డివిజన్ - మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ 

 రహమత్ నగర్ డివిజన్ - మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

 వెంగల్ రావు నగర్ డివిజన్‌ – మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి 

 సోమాజిగూడ డివిజన్‌ – మంత్రులు శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్ 

 బోరబండ డివిజన్ – మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి 

 షేక్ పేట్ డివిజన్‌ - మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి 

 ఎర్రగడ్డ డివిజన్‌ - మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు

ఈ ఉప ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్ లో తమ బలం భారీగా పెరిగిందని చాటడానికి అధికార కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగనున్నారు. రెండు దశల్లో సీఎం రవేంత్ ప్రచారం చేయనున్నారు. భారీ బహిరంగ సభతో పాటు పలు చోట్ల రోడ్‌షోలలో పాల్గొననున్నారు. మొదటి దశ అక్టోబర్ 30–31 తేదీ, రెండో దశ నవంబర్ 4–5 తేదీల్లో ప్రచారం చేస్తారు. 

ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర మంత్రులు సైతం ప్రచారంలో దిగితో శ్రేణుల్లో మరింత జోష్ వస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. 

Advertisment
తాజా కథనాలు