MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఘన స్వాగతం.. ఏపీలో భారీగా ఫ్లెక్సీలు-VIDEO

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
MLC Kalvakuntla Kavitha Biyyapu madhu sudan reddy

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(kalvakuntla-kavitha) దంపతులు నిన్న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తికి కూడా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత దంపతులకు వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి(biyyapu-madhusudhan-reddy) ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం స్వయంగా ఆలయ విశేషాలను వివరించారు. కవితకు స్వాగతం పలుకుతూ శ్రీకాళహస్తిలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు మధుసూదన్ రెడ్డి. ఈ ఫ్లెక్సీలపై కవితతో పాటు కేసీఆర్ ఫొటోలను సైతం ఆయన ఏర్పాటు చేయించారు.

Also Read :  టీడీపీలో విషాదం.. కీలక నేత కన్నుమూత!

మధుసూదన్ రెడ్డి ఇంట్లో భోజనం..

దర్శనం అనంతరం కవిత దంపతులు మధుసూదన్ రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వారికి స్వయంగా వడ్డించారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. కవిత దంపతులు, బియ్యపు మధుసుదన్ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తికి వచ్చిన కవితకు ఆయన ఘన స్వాగతం పలికినట్లు సమాచారం. 

Also Read :  ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Advertisment
తాజా కథనాలు