Telangana Secretariat : సచివాలయంలో కూలిన గోడ...తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. పెచ్చులూడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే సచివాలయం పెచ్చులూడిన ప్రాంతంలోనే ఒక కారు ఉండటంతో ఆ కారు ధ్వంసం అయింది.