/rtv/media/media_files/2025/02/04/xdG4cpaxWtztkXRBQVXf.jpg)
Telangana Secretariat Photograph: (Telangana Secretariat)
తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తామంటూ బెందిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు రోజులుగా ఫోన్ చేస్తూ సెక్రటేరియట్‌లో బాంబు పెట్టామని బెదిరిస్తున్న దుండగుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆగంతకుడి ఆచూకీ తెలుసుకున్నారు. పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడు ఫోన్ కాల్‌లో చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. సెక్రటేరియట్ మొత్తం బాంబు స్వాడ్ వెతికారు. కానీ బాంబు పేలుడు పదార్థాల ఆచూకీ లభించలేదు.
Also Read: వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?
ఫోన్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని విచారించగా.. సెక్రటేరియట్‌లో బాంబ్ పెట్టలేదని తేలింది. ఇదంతా ఒక ఫేక్ డ్రామా పోలీసులు తెలిపారు. అయితే.. అతను ఎందుకు ఈ ఫేక్ బెదిరింపులకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు మూడు రోజుల నుంచి ఇదే తంతు. ఫోన్ చేసి తెలంగాణ సచివాలయాన్ని బ్లాస్ట్ చేస్తామని బెదిరిస్తున్నాడు. దీంతో అతని ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాప్ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. దేని కోసం అలా ఫోన్ చేసి బెదిరించాడని ప్రశ్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి పర్సనల్ డేటా సేకరిస్తున్నారు.
Also Read: జాతీయ క్రీడల్లో భారీ కుంభకోణం.. బంగారు పతకాలు అమ్ముకున్న డైరెక్టర్!