Harish Rao: కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం ఇవే! హరీష్ రావు ట్వీట్ వైరల్

ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, బుద్ధవనం, యాదగిరిగుట్ట, కమాండ్ కంట్రోల్ సెంటర్ లను సందర్శించారు. ఆ పోటోలను హారిష్‌రావు ఎక్స్‌ వేదికగా ‘కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం' అని చేసిన ట్వీట్ చేశారు.

New Update
Harish Rao tweet

Harish Rao tweet

Harish Rao Thanneeru : తెలంగాణ ఉద్యమం తర్వాత అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టింది. వాటిలో యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవాలయం, సచివాలయం, నాగార్జునసాగర్‌ సమీపంలో బుద్ధవనం, జూబ్లీహిల్స్‌లో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, అంబేద్కర్‌ విగ్రహం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణులంతా తెలంగాణలోని ప్రముఖ స్థలాలను సందర్శిస్తున్నారు. అందులో  భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర టూరిజం విభాగం ఆధ్వర్యంలో అందాల భామలను రోజుకో ప్రదేశానికి తీసుకెళ్లి వాటి ప్రముఖ్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా కేసీఆర్‌ హాయాంలో నిర్మించిన పలు ప్రాంతాలను ఈ సందరీమణులు సందర్శించారు. కాగా అందుకు సంబంధించిన పోటోలను హారిష్‌రావు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

‘కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం. ఎవరు అవునన్నా, కాదన్నా.. తెలంగాణ అభివృద్ధి చిహ్నాలు అవి, బీఆర్ఎస్ పాలన కీర్తి కిరీటాలు చెరిపేస్తే చెరిగేవి కావు, దాచేస్తే దాగేవి కావు. జై కేసీఆర్, జై తెలంగాణ’ అంటూ హరీశ్ రావు ఎక్స్‌ లో ట్వీట్‌ చేశారు.  ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం దీనిపై స్పందిస్తున్నారు. కేసీర్‌ ఆనవాళ్లు చెరిపేస్తా అన్న రేవంత్‌కు ఏ ఆనవాళ్లు కేసీఆర్‌ ఆనవాళ్ల చుట్టే తిరుగుతున్నాడని కామెంట్‌ చేస్తున్నారు. నిన్నటి వరకు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని అన్నారు.. నేడు అవే కేసీఆర్ ఆనవాళ్లు రేవంత్ సర్కార్ కు దిక్కైందని, కేసీఆర్ ఆనవాళ్ల ముందు ప్రపంచ సుందరీమణులు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

కాగా బీఆర్‌ఎస్‌ పాలన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. కాగా పలు సందర్భాల్లో  కేసీఆర్‌ ఆనవాళ్లు అనే అంశంపై చర్చ సాగింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మీ ఆనవాళ్లు లేకుండా చేస్తా.. నాదే జిమ్మెదారి' అని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఆ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఇటీవల ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని ప్రశ్నించారు.

ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు