HYD RAINS : మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.