Heavy rains: తెలంగాణ మళ్లీ వరద ముప్పు.. 4 రోజులు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ పలు జిల్లాల్లో సెప్టెంబర్ 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే 4రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

New Update
heavy rains

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ పలు జిల్లాల్లో సెప్టెంబర్ 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్‌, కుమురంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్‌, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుశాయి. గురువారం కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జోగులాంబ జిల్లాలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు కూలీలు మృతి చెందారు.

బుధవారం సాయంత్రం సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతంలో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. భారీ వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు