BIG BREAKING: ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్!
ఫీజులు పెంచుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఫీజుల పెంపు విషయమై టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.