తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అధారే బదిలీ

 తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే గతేడాది జులైలో నియామకమయ్యారు. సీజేగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

New Update
TS cj h

TS cj h Photograph: (TS cj h)

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే గతేడాది జులైలో నియామకమయ్యారు. సీజేగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్‌ అలోక్‌ అరాధేను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. 

ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!

1964 ఏప్రిల్‌ 13న రాయ్‌పూర్‌లో జన్మించిన జస్టిస్‌ అలోక్‌ 1988లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 సెప్టెంబరులో జమ్ము కశ్మీర్‌ హైకోర్టుకు బదిలీ కాగా.. 2018లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. కర్ణాటక నుంచి తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నుంచి బాంబే హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

ఇది కూడా చదవండి: Dogs: అయ్యో పాపం.. కాళ్లు,నోళ్లు కట్టేసి 32కుక్కలను చంపిన గ్రామస్థులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు