Group1 Exam: నేడే తెలంగాణ గ్రూప్‌-1పై హైకోర్టు తీర్పు

గ్రూప్‌-1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది, రద్దు చేయవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.

New Update
Telangana High Court

Telangana High Court

Group1 Exam : గ్రూప్‌-1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇలా అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.

Also Read : అల్లు కనకరత్నమ్మ దశదినకర్మ.. పవన్, కేటీఆర్ సహా ప్రముఖుల నివాళులు

గ్రూపు నిర్వహణలో అవకతవకలు జరిగాయని  వాటిని రద్దు చేయాలని కొందరు తమ వాదన వినిపించగా, రద్దు చేయవద్దంటూ మరికొందరు వేసిన పిటిషన్లపై  జులై 7న వాదనలు జరిగాయి. వారి వాదనలు విన్న జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ఈ రోజు తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్‌-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కానీ, హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్‌ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ రోజు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది.

Also Read : సోషల్ మీడియాలో నటి అశ్లీల వీడియోలు...ఆమె ఏం చేసిందంటే..?

Advertisment
తాజా కథనాలు