చార్మినార్ ను కూడా కూలుస్తారా?: హైడ్రా చీఫ్ పై హైకోర్టు ఫైర్! హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఎందుకు కూల్చారని ప్రశ్నించింది. వద్దని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ మండిపడింది. 48 గంటల్లోగా ఖాళీ చేయాలని ముందే ఎలా కూలుస్తారని నిలదీసింది.చార్మినార్‌ను కూడా కూలుస్తారా అంటూ సీరియస్ అయ్యింది. By B Aravind 30 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఎందుకు కూల్చారని ప్రశ్నించింది. వద్దని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ మండిపడింది. కూల్చివేయాలని కలెక్టర్ ఎందుకు చెప్పారు.. 48 గంటల్లోగా ఖాళీ చేయాలని ముందే ఎలా కూలుస్తారని నిలదీసింది. కూల్చడమే హైడ్రా పాలసీనా అంటూ ఘాటుగా స్పందించింది. హైడ్రాపై వర్చువల్‌గా హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరుకాగా.. అమీన్‌పూర్ తహశీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. '' శని, ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు. సెలవు దినాల్లో నోటీసులు ఇచ్చి.. ఎందుకు అత్యవసరంగా కూల్చాల్సి వస్తోంది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయి. తహశీల్దార్‌కు ఆ విషయం కూడా తెలియదా. Also Read: స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం చార్మినార్‌ను కూడా కూలుస్తారా ? ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చివేయాల్సిన అవసరం ఏముంది. ఈ కేసుపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చినట్లు తెలియదా ?. చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా ?.చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేస్తారా ?'' అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆదివారం నిర్మాణాలు కూల్చివేయొచ్చా అని హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించింది. అక్రమ కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది ఇవ్వాలని కోరడంతో అందించామని రంగనాథ్ తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తావా అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైడ్రా ఇలాగే ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది. #hydra #telangana-highcourt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి