/rtv/media/media_files/2025/03/24/Hykok2kv4qzuZIEoqnit.jpg)
Telangana High Court
BIG BREAKING : ఫీజులు పెంచుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఫీజుల పెంపు విషయమై తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇది కూడా ఆరువారాల్లో తీసుకుని ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు పంపాలని కోర్టు సూచించింది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టే ఫీజుల పెంపు విషయం ఆధారపడి ఉంటుందని తెలిపింది.'
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుతో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపపై ప్రతి ఏటా ఓ తంతు నడుస్తోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిసారి ఆయా కాలేజీలు పీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయడం, దానిపై టీఏఎఫ్‌ఆర్‌సీ ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం,కౌన్సెలింగ్ పూర్తయి అడ్మిషన్‌లు చేపట్టేదాకా దానిపై నిర్ణయం తీసుకోకపోవడంతో కాలేజీలు కోర్టు మెట్లు ఎక్కడం సర్వసాధారణమై పొయిందని కోర్టు అభిప్రాయపడింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో గత ఏడాది ఫీజులే 2025-26కు వర్తిస్తాయంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గురునానక్, గోకరాజు రంగరాజు కాలేజీలతో పాటు సుమారు 11 కళాశాలలు గురువారం లంచ్ మోషన్ పిటిషన్‌లు దాఖలు చేశాయి.వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
కాగా టీఏఎఫ్‌ఆర్‌సీ మూడేళ్లకోసారి కాలేజీలను పరిశీలించి ఫీజు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. టీఏఎఫ్‌ఆర్‌సీ కి డిసెంబరులో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు నిర్ణయం తీసుకోలేదని, 15 మంది సభ్యులదాకా ఉన్న కమిటీ నిర్ణయంలో జాప్యమెందుకని కోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో టీఏఎఫ్‌ఆర్‌సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని, కౌన్సెలింగ్ పూర్తయ్యాక పిటిషన్‌లు వేయడమేమిటని కాలేజీలను హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: ఒత్తిడిని పెంచే ఐదు ఆహారాలు.. వీటి ఎఫెక్ట్ తెలుసుకోండి
ఈ సందర్బంగా కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ తన వాదనలు వినిపించారు. ఆయన తన వాదన వినిపిస్తూ గత డిసెంబరులో ప్రతిపాదనలు సమర్పించామని, మార్చిలో కమిటీ సమావేశమైందని, అందులో తమ ప్రతిపాదనలు ఆమోదించిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రిజిస్టర్‌లో నమోదు చేసిన వివరాలే సాక్ష్యధారాలని ఆయన వాదించారు. అయితే ఈ విషయమై టీఏఎఫ్‌ఆర్‌సీ తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు 5000 పేజీలతో పిటిషన్ వేశాయని, వాటిని పరిశీలించడానికి సమయం పడుతుందన్నారు. అందుకే గత బ్లాక్ పీరియడ్‌లో వసూలు చేసిన మొత్తాన్నే ఈ ఏడాదికి సిఫారసు చేసిందన్నారు. ప్రభుత్వం తరఫున రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా ఇప్పుడున్న కాలేజీల్లో కొన్ని గత ఏడాది కంటే సుమారు 70 నుంచి 90 శాతం పెంచాలని అడుగుతున్నాయన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారుజ కాగా అన్ని వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు