/rtv/media/media_files/2025/09/22/singareni-2025-09-22-13-08-28.jpg)
సింగరేణి కార్మికులకు దసరా బోనస్(Dasara Bonus) ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 1,95, 610 బోనస్ ప్రకటించింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల 500గా బోనస్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది సింగరేణి లాభం రూ.2,360 కోట్లని, సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.819 కోట్ల బోనస్ ఇస్తున్నట్లుగా వెల్లడించారు.
సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన..!! @revanth_anumula
— Geetha Ainala (@GeethaAinala) September 22, 2025
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు..!!
కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతాం..
రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా… pic.twitter.com/gbnqfVTGUB
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల(singareni-workers) పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదన్నారు సీఎం రేవంత్(CM Revanth Reddy). రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను తమపార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందని చెప్పారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు.
మొత్తం ఆదాయం రూ.6,394 కోట్లు
సింగరేణి మొత్తం ఆదాయం రూ.6, 394 కోట్లు కాగా, ఇందులో రూ.4034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామన్నారు సీఎం రేవంత్. రూ. l2 వేల 360 కోట్లు నికర లాభాలు వచ్చాయని తెలిపారు. అందులో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించామని, ఈసారి కాంట్రాక్టు కార్మికులకు రూ.5500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని, ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు సీఎం. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్ లో కార్మికులకు అండగా ఉంటాం.. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామన్నారు. కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తామని వెల్లడించారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందన్నారు సీఎం. తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నామని రేవంత్ వెల్లడించారు.
Also Read : Hyderabad: మేడ్చల్‌లో దారుణం.. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సూసైడ్