konda Surekha : అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్ చేశారు. అర్థరాత్రి ఆమె నాగార్జున ఫ్యామిలీపై ట్వీట్ చేశారు.  గతంలో తాను నాగార్జున, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు

New Update
nagarjuna

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్ చేశారు. అర్థరాత్రి ఆమె నాగార్జున ఫ్యామిలీపై ట్వీట్ చేశారు.  గతంలో తాను నాగార్జున, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడ లేదన్నారు. త‌న కామెంట్స్‌ పట్ల  నాగార్జున ఫ్యామిలీ బాధపడి ఉంటే, అందుకు చింతిస్తున్నట్లుగా ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు.

గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ‌ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఆర్థరాత్రి 12 గంటలు దాటిన తరువాత ఆమె ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా  మారింది.  కాగా  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై, ముఖ్యంగా నాగ చైతన్య , సమంత విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి.

నాగార్జున పరువు నష్టం దావా

అయితే నాగార్జున ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పరువు నష్టం దావా కూడా వేశారు.సమంత,  నాగ చైతన్య కూడా వారి విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేస్తూ, తమ పేర్లను రాజకీయ పోరాటాల నుండి దూరంగా ఉంచాలని అభ్యర్థించారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. 

Advertisment
తాజా కథనాలు