/rtv/media/media_files/2026/02/20/tgspdcl-2026-02-20-07-11-10.jpg)
టీజీఎస్పీడీసీఎల్‌లో అవినీతికి పాల్పడిన ఇంజనీర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. శాఖలో పేరుకుపోయిన అవినీతిని అరికట్టే క్రమంలో భాగంగా ఒకేసారి ఎనిమిది మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ADEలు), అసిస్టెంట్ ఇంజనీర్లు (AEలు), సబ్ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. యాంటీ బ్రైబరీ సెల్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఇంటెలిజెన్స్ విభాగం లోతుగా విచారణ జరపడంతో వీరి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు వంటి పనుల కోసం ఈ అధికారులు వినియోగదారుల నుండి భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. వీరు ఎంత ధైర్యంగా అవినీతికి పాల్పడ్డారంటే, లంచం డబ్బులను నేరుగా ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా స్వీకరించినట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ డిజిటల్ లావాదేవీల సాక్ష్యాధారాలతో అవినీతి నిర్ధారణ కావడంతో, ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించకుండా బాధ్యులైన అధికారులపై తక్షణమే వేటు వేసింది. ఈ చర్యతో విద్యుత్ శాఖలోని ఇతర అవినీతి అధికారులకు ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపినట్లయింది.
ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ ఆఫీసర్లు
మరోవైపు ఓ ఫైల్ ను ప్రాసెస్ చేయడా నికి రూ.70 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు విద్యాశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి తన స్కూల్ కు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ ఎన్ఎసీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా డు. ఆ ఫైల్ ను ప్రాసెస్ చేయడానికి హైదరాబాద్ సైఫాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడల శ్రీధర్ రూ.70 వేల డిమాండ్ చేశాడు. సూపరింటెండెంట్ తో మాట్లాడి ఎన్టీసీ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం డిమాండ్ చేసిన రూ. 70 వేల నగదును సూపరింటెండెంట్ సంగీన ఫణిరాజ్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ స్వీకరిస్తుండ గా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
Follow Us