Seetha Dayakar Reddy : తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...
తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీతాదయాకర్ రెడ్డితో పాటు ఆరుగురు సభ్యులను నియమించింది. వీరంతా మూడు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.