Breaking: ఏడీఈ అంబేడ్కర్‌కు మరో షాక్‌.. స్నేహితుడి ఇంట్లో అక్రమాస్తులు గుర్తించిన ACB

విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్న అంబేద్కర్ స్నేహితుడు, చేవేళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.17 లక్షల నగదు, స్థిరాస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

New Update
ACB

ACB

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న వ్యవహారంలో ఇటీవల విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన బంధువు ఇంట్లో ఏకంగా రూ.2 కోట్ల నగదు దొరికింది. మొత్తంగా ఆయనకు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్న అంబేద్కర్ స్నేహితుడు, చేవేళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.17 లక్షల నగదు, స్థిరాస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

Also read: గుండెపగిలే ఘోరం.. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి దంపతులు సజీవ దహనం..

అంబేద్కర్ కూడిన అక్రమాస్తులను రాజేశ్ దగ్గర ఉంచారనే కోణంలో ACB అధికారులు విచారణ చేస్తున్నారు. అంబేద్కర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే రెండు రోజుల నుంచి రాజేశ్‌ విధులకు హాజరుకానట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించగా అక్రమాస్తులు బయటపడ్డాయి. 

Also Read: ప్రభుత్వం కూలుతుంది జాగ్రత్త.. రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సంచలన వార్నింగ్-VIDEO

Advertisment
తాజా కథనాలు