/rtv/media/media_files/2025/08/18/addanki-2025-08-18-13-36-47.jpg)
తెలంగాణ లోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో నిరుద్యోగులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో భేటీ కానున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎంతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లుగా వెల్లడించారు. నిరుద్యోగులు అందరూ సకరించాలని కోరారు. త్వరలో ఈ ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
వారంలో నిరుద్యోగుల తో ఉప ముఖ్యమంత్రి భేటీ
— Addanki Dayakar (@ADayakarINC) August 18, 2025
ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో మాట్లాడటం జరిగింది
ప్రజా భవన్ లో నిరుద్యోగుల తో భేటీ
ఉద్యోగాల భర్తీ కి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బట్టి గారు సానుకూలంగా స్పందించారు
నిరుద్యోగులు అందరూ సకరించాలని మనవి.@revanth_anumulapic.twitter.com/YseOltKcX6
కాగా ఇటీవల హైదరాబాద్‌లోని చిక్కడపల్లి లైబ్రరీలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు నిరసన ఎదురైంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆయనను నిలదీసింది. ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయడంలో, ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో ఆలస్యం చేస్తున్నందుకు నిరుద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందని, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల అమలులో జాప్యం జరగడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపైనే వారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ను నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎక్స్ వేదికగా మాట్లాడుతూ
అయితే ఈ లైబ్రరీ మీటింగ్‌పై అద్దంకి దయాకర్ తన ఎక్స్ వేదికగా మాట్లాడుతూ నిరుద్యోగుల వద్దకే ప్రభుత్వమని తెలిపారు. చిక్కడపల్లి హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థి నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నానని వెల్లడించారు. నిరుద్యోగుల్లారా.. నిరాశ నిస్పృహలకు లోను కాకండి.. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. మీ సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని భరోసా ఇచ్చారు.