/rtv/media/media_files/2025/03/09/DPdzu6lw1Wmip3bDexYR.jpg)
SLBC Tunnel Collapse
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్ వద్ద కేరళ జాగిలాలు మనుషుల ఆనవాళ్లను గుర్తించాయి. ఈ క్రమంలో సిబ్బంది అక్కడున్న మట్టిని తొలగించి ఓ మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగతా ఏడుగురి కోసం గాలిస్తున్నారు.
Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
టన్నెల్ రెస్క్యూ పనులను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... ఐఐటీ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు కేరళ నుంచి క్యాడవర్ స్నిఫర్ డాగ్స్‌ను కూడా తెప్పించింది. మానవ శరీర అవశేషాలు, కుళ్లిపోయిన మృతదేహాలు, 15 అడుగుల కింద బురదలో కూరుకుపోయిన డెడ్‌బాడీలను సైతం గుర్తించడం, గాలిలో, భూమిలోపల వాసనను పసి గట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండడం ఈ డాగ్స్ ప్రత్యేకత. ఈ డాగ్స్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లలో కేరళ నుంచి దోమలపెంటలోని టన్నెల్ వద్దకు గురువారం తీసుకొచ్చారు.
Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక రోబోల వినియోగం తప్పదని కూడా అధికారులు అంటున్నారు. ఆదివారం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు. ఇదిలాఉండగా కృష్ణా జలాలను ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్‌కు తరలించేందుకు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2005లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ వాటి పనులు నెమ్మదిగా సాగుతూ వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించగా టన్నెల్ కూలి 8 మంది చిక్కుకుకుపోవడం సంచలనం రేపింది.
Also Read: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?