BIG BREAKING: కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5.30 గంటలకు హైదర్‌గూడలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

New Update
Former Chevella MLA Konda Lakshma Reddy passes away at 84

Former Chevella MLA Konda Lakshma Reddy passes away at 84

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5.30 గంటలకు హైదర్‌గూడలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కొండా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ ప్రతినిధిగా పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్ సభస్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Also Read: మత్స్యకారులకు కాసుల వర్షం.. రూ.కోటికి అమ్ముడుపోయిన చేపలు

కొండా లక్ష్మా రెడ్డి ప్రస్తుతం న్యూస్‌ అండ్ సర్వీసెస్ సిండికేట్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన జర్నలిజం పట్ల ఇష్టంతో 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను ప్రారంభించారు. 

Also Read: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు

అలాగే జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్స్‌ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, అలాగే ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈయన ఉమ్మడి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కొండా వెంకట రంగారెడ్డి మనవడు. తన రాజకీయ  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) ప్రతినిధిగా, గ్రీవెన్స్ సెల్‌ ఛైర్మన్‌తో సహా పలు పదవులు నిర్వహించారు. అంతేకాదు ఏపీ క్రీడా మండలి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 

Also Read: నాపై కుట్రలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ సంచలన కామెంట్స్

Advertisment
తాజా కథనాలు