మాది మాటల గారడీ పార్టీ కాదు.. దానికే కట్టుబడి ఉన్నాం: విజయ్
ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఈ నెల చివర్లో మొదటిసారిగా బహిరంగ సమావేశం నిర్వహించనుంది.ఈ సందర్భంగా విజయ్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ మాటల గారడీ పార్టీ కాదని.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Bagmati Express: భాగమతి రైలు ప్రమాదంపై.. దక్షిణ రైల్వే కీలక ప్రకటన
ఇటీవల తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర మైసూరు -దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే సోషల్ మీడియా వేదికగా కోరింది.
Chennai: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య!
భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. మధురైలో కేసు నమోదు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కల్యాణ్ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్ అనే న్యాయవాది మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో రూ.3.71 కోట్ల విలువైన బంగారం పట్టివేత
తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.7 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Tamilnadu : ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురి మృతి..14 మందికి తీవ్ర గాయాలు!
తమిళనాడులోని ఉలుందూరుపేట సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్టటూరు సమీపంలో టూరిస్ట్ వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.