జమిలీ ఎన్నికలపై విజయ్ పార్టీ సంచలన ప్రకటన

జమిలీ ఎన్నికలకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని విజయ్ ప్రకటన చేశారు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా తమిళిగా వెట్రి కగజం (TVK) పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. మరోవైపు అబద్దపు హామీలతో డీఎంకే అధికారంలోకి వచ్చిందని విజయ్ విమర్శించారు.

New Update
Vijay 2


ప్రముఖ సినీ నటుడు విజయ్‌ తమిళిగా వెట్రి కగజం (TVK) పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇటీవలే తన మొదటి బహిరంగ సభకు కూడా లక్షలాది మంది ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం జమిలీ ఎన్నికల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టీవీకి పార్టీ జమిలి ఎన్నికలతో పాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.  

Also Read: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

జమిలీకి మేం వ్యతిరేకం

ఆదివారం చెన్నైలోని విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో జమిలీ ఎన్నికలకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని విజయ్ ప్రకటన చేశారు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. నీట్ పరీక్షపై కూడా తాజాగా తీర్మానం చేశారు. మరోవైపు స్టాలిన్ ప్రభుత్వంపై కూడా విజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారని.. కులగణన ప్రక్రియ ఆలస్యంపై డీఎంకే తీరును తప్పుబట్టారు.  

హిందీకి చోటులేదు 

తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే అమల్లో ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హిందీ అమలుకు కూడా వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎట్టి పరస్థితుల్లో కూడా హిందీ భాషకు తమిళనాడులో చోటు లేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెత్తనం లేకుండా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తని కల్పించాలని డిమాండ్ చేశారు. 

Also Read: 85 లక్షల వాట్సప్‌ అకౌంట్స్ బ్లాక్!

అక్టోబర్ 27న విజయ్.. టీవీకే పార్టీ తొలి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోటీపై స్పష్టతం ఇచ్చారు. 2026లో జరగనున్న ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని చెప్పారు. క్షేత్రస్థాయిలో చూసుకుంటే మహిళలకే తమ పార్టీలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరి విజయ్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు