రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం చోటు చేసుకోనుంది. ఇది క్రమంగా బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని అధికారులు తెలిపారు. అల్పపీడనం నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 18, 19, 20 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read : 'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం పడిపోయిన టెంపరేచర్.. ఇదిలా ఉంటే ఏపీలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి పోయింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 18 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా.. ఏజెన్సీ ప్రాంతాల్లో 16 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో అరకు, సాలూరు ఏరియాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్! Also Read: నేడే "బిగ్ బాస్-8" లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!