చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తున్న ఫెయింజల్ తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల వల్ల చెన్నై సహా ఇతర ప్రాంతాలు నీటమునిగాయి. దీని ప్రభావంతో చెన్నై ఎయిర్‌పోర్టును శనివారం సాయంత్రం 7 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు.

New Update
Flighttt

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు దూసుకొస్తున్న ఫెయింజల్ తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా ఇతర ప్రాంతాలు నీటమునిగాయి. దీని ప్రభావంతో చెన్నై ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఈదురు గాలులు బలంగా వీయడం, భారీ వర్షాలు కురవడం వల్ల శనివారం సాయంత్రం 7 గంటల వరకు ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: తెలంగాణలో అత్యత్తమ MSME విధానం తీసుకొచ్చాం

శుక్రవారం నుంచే అక్కడ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే తమ సర్వీసులను రద్దు చేస్తు్న్నట్లు పలు ఎయిర్‌లైన్లు చెప్పేశాయి. కొన్ని విమానాలైతే చాలా ఆలస్యంగా నడిచాయి. అయితే తాజాగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక శనివారం సాయంత్రం నాటికి ఫెయింజల్ తుపాను కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చని చెన్నై వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది. 

Also Read: ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్

శనివారం సాయంత్రం నాటికి ఈ తుపాను కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చని చెన్నై వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. తీరం దాటేటప్పుడూ ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు. అంతేకాదు భీకర గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే తుపాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని సీఎం స్టాలిన్‌ చెప్పారు. మరోవైపు పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.        

Also Read: మహారాష్ట్ర ఓటమి ఎఫెక్ట్.. కాంగ్రెస్ లో రచ్చ రచ్చ!

Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు