ఎవరైనా ఏదైనా ఖరీదైన వస్తువును పొగొట్టుకున్నప్పుడు వచ్చే బాధ వర్ణించలేనిది. అది దక్కించుకునేందుకు అన్ని ప్రదేశాలు వెతుకుతారు. చివరికీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తారు. అయితే తమిళనాడులోని ఓ ఆలయంలో మాత్రం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దేవుని దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా.. ఒక్కసారిగా అతడి జేబులో ఉన్న ఐఫోన్ అందులో పడిపోయింది. దీంతో కంగారుపడిన అతను ఆలయ అధికారులకు ఈ విషయం చెప్పాడు. హుండీలో వేసేది దేవుని ఖాతాలోకే వెళ్తుందని వాళ్లు చెప్పడంతో అతడు షాకైపోయాడు.
Also Read: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది
ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని వినయగపురంలో దినేష్ అనే వ్యక్తి ఉంటున్నాడు. తాజాగా అతడు తిరుపోరూరులోని కందస్వామి గుడికి వెళ్లారు. అయితే దేవుడి హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి జేబులో ఉన్న ఐఫోన్ జారి హుండీలో పడిపోయింది. దీంతో అతడు ఆందోళనకు గురయ్యాడు.
Also Read: మళ్లీ అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం: రోజా ఉగ్రరూపం
ఇలా జరిగిన విషయాన్ని అతడు ఆలయ యాజమాన్యానికి చెప్పాడు. తన ఫోన్ ఇప్పించమని వేడుకున్నాడు. అయితే ఫోన్ హుండీలో పడటంతో అది ఆలయ ఆస్తికే చెందుతుందని చెప్పారు. ఫోన్ ఇచ్చేందుకు తిరస్కరించారు. ఎట్టిపరిస్థి్తుల్లో తిరిగి ఇవ్వలేమని.. డేటా మాత్రం తీసుకోవచ్చని చెప్పారు. చివరికి అతడు హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ అధికారులకు, స్థానిక మంత్రి శేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మంత్రి కూడా.. హుండీలో వేసిన వస్తువు దేవుడి ఖాతాలోకే వెళ్తుందని.. తిరిగి ఫోన్ ఇచ్చేందుకు రూల్స్ అంగీకరించవని చెప్పారు. అయితే ఆ ఆలయ హుండీని రెండునెలలకు ఒకసారి తెరుస్తారని అధికారులు చెబుతున్నారు.
అయితే గురువారం ఆలయ హుండీని తెరిచారు. దినేష్‌కు ఈ విషయం చెప్పడంతో ఫోన్ తీసుకోవ్చని దినేష్ అక్కడి వెళ్లాడు. హుండీ నుంచి తన ఐఫోన్ తీసుకున్నాడు. కానీ హుండీలో ఏది పడ్డా అది దేవుడికేనని ఆలయ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో అతడు చేసేదేమి లేక ఐఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డు తీసుకొని వెళ్లిపోయాడు.
iPhone accidentally fell into the temple's hundi..
— Vije (@vijeshetty) December 20, 2024
The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib
Also Read: రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్
Also Read: రేవంత్ కు కౌంటర్.. అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్