Tamilnadu: దూసుకొచ్చిన కుర్తాళం జలపాతం... బాలుడి గల్లంతు!
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం వద్ద ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల్లో 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం వద్ద ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల్లో 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.
ఊటీ, కొడైకెనాల్ లో సేద తీరాలనుకునే పర్యాటకులకు మంగళవారం నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్ తప్పనిసరి చేసింది. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు.
తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తి ఆదివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ సారి ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.
ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్ అయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చంద్రబాబు నాయుడు,లాలూ యాదవ్, హేమంత్ సోరెన్ ఉన్నారు.
చెన్నైలో జరుగుతున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక మీదకు వెళ్తుండగా స్టాలిన్ బ్యాలెన్స్ కోల్పోయారు. దీంతో మోడీ ఆయన చేయి పట్టుకుని స్టేజీ వద్దకు తీసుకుని వెళ్లారు.
తమిళనాడు లో పూజారులు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకున్నారు. మీ అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చుకున్నారు.
భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారని..వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.