Tamilanadu: భారీ పేలుడు.. ఆరుగురు మృతి!

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా సత్తూరు సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.అంతేకాకుండా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
fireaccident

fireaccident

Tamilanadu: తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా సత్తూరు సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.అంతేకాకుండా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అప్పయ్య నాయకన్‌పట్టిలోని సాయినాథ్‌ అనే ప్రైవేట్‌ పటాసులు ఫ్యాక్టరీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Also Read: Konstas: బుమ్రాతో కొన్‌స్టాస్ గొడవ.. చివరి బంతికే వికెట్, కోహ్లీ రియాక్షన్ చూశారా!

4 గదులు కూలి..

భారీ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని 4 గదులు కూలి నేలమట్టమయ్యాయి. విషయం తెలుసుకున్న.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని శిథిలాలలో చిక్కుకున్న ఒకరిని రక్షించాగా.. అతను చికిత్స పొందుతూ చనిపోయాడు.అయితే, బాణాసంచా తయారీ సమయంలో షార్ట్ సర్క్యూట్ తో పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Also Read: Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

ఈ సంఘటనతో విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారాల్లో భద్రతా లోపాలాన్ని గుర్తించారు. అలాగే, గతేడాది సత్తూరులోని బాణాసంచా తయారీ ప్లాంట్‌లో భద్రతా నిబంధనలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనిఖీ చేసినప్పటికీ.. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను అమలు చేయడంతో పాటు బాణసంచా పరిశ్రమను సమర్థవంతంగా నిర్వహించడంలో  అధికార యంత్రాంగం విఫలమైనట్లు స్టానికులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు!

Also Read: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు