Pongal Holidays 2025: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు!

తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 17ను కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇప్పటికే జనవరి 14, 15, 16 సెలవు దినాలుగా తెలిపింది. ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మధ్యలో వచ్చిన శుక్రవారాన్ని కూడా సెలవు దినంగా సీఎం ఆదేశించారు.

New Update
pongal school holidays

pongal school holidays

Pongal Holidays 2025: సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో అంతా తట్టాబుట్టా సర్దుకున్నారు. దేశ నలుమూలల నుంచి సొంతూళ్లకు పయణమవుతున్నారు. తెలుగు ప్రజలు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తమిళులు కూడా ఈ పండుగను అత్యంత గ్రాండ్‌గా, ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకుంటారు. 

Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

దీంతో పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా పలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు అదనపు బస్సులు, రైళ్లు తదితరాలు సిద్ధంగా ఉన్నాయి. దీపావళి కంటే ఎక్కువ మంది పొంగల్ జరుపుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. పొంగల్ పండుగకు వారం రోజులు మాత్రమే ఉండడంతో కొత్త బట్టలు కొనేందుకు చాలా మంది దుకాణాలకు బారులు తీరుతున్నారు.

Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్(Pongal Holidays 2025)

ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. జనవరి 14న తై పొంగల్ పండుగను జరుపుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే జనవరి 15, జనవరి 16న మట్టుపొంగల్‌, రైతు దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీంతో ఈ మూడు రోజులు సెలవు దినాలుగా(Pongal Holidays 2025) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే శుక్రవారం మాత్రమే పని దినం కావడంతో చాలామంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

Also Read : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!

వచ్చే 2 రోజులు (శని, ఆదివారాలు) సెలవులు కావడంతో మధ్యలో వచ్చే శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు జనవరి 17 కూడా సెలవు దినంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.

Also Read : ఆ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

దీంతో జనవరి 14 నుంచి 19 వరకు.. మొత్తం ఆరు రోజులు సెలవులు వచ్చాయి. అయితే జనవరి 17న ఇచ్చిన సెలవును కవర్ చేయడానికి జనవరి 25 (శనివారం) పనిదినంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో చాలా మంది ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మేరకు సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు