Tamilanadu: తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి పండగ కానుకను ప్రకటించింది. రాష్ట్రంలో పొంగల్ స్పెషల్ బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ కానుకగా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.163.81 కోట్లు కేటాయించినట్లు సర్కార్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. పొంగల్ బోనస్‌తోపాటు రాష్ట్రంలోని గ్రూప్ సీ, డీ కేటగిరీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అసిస్టెంట్లకు స్పెషల్ పే గురించి ను ప్రకటించింది. Also Read: Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు! ఈ ప్రెస్ నోట్ ప్రకారం.. గ్రూప్ సీ, డీ ఉద్యోగులు, టీచర్లకు స్పెషల్ పే కింద రూ.3వేల వరకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రోజువారీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి.. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కనీసం 240 రోజుల సర్వీసు ఉంటేనే కన్సాలిడేటెడ్ వేతనం, స్పెషల్ టైమ్ స్కేల్ పే పొందడానికి అర్హులు అవుతారని ప్రభుత్వం తెలిపింది. అలాంటి వారికి స్పెషల్ బోనస్ కింద రూ.1000 అందించనున్నట్లు చెప్పింది. Also Read: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని వివరించింది. ఇక పొంగల్ గిఫ్ట్ కింద గ్రూప్ సీ, డీ.. పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, మాజీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ లకు రూ.500 చొప్పున అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రూ. 3వేల వరకు బోనస్.. గ్రూప్ సీ, డీ కేటగిరీకి చెందిన రెగ్యులర్, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులకి కూడా రూ. 3వేల వరకు బోనస్ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ టైమ్ స్కేల్‌ల వేతనాలపై పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉపాధ్యాయులకు రూ.1000 ప్రత్యేక అడ్ హక్ బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పింది. 2024 అక్టోబర్‌లో చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే గ్రూప్ సీ, డీ కేటగిరీలకు చెందిన అర్హులైన ఉద్యోగులందరికీ కనిష్టంగా రూ.8,400.. గరిష్టంగా రూ.16,800 బోనస్ అందజేసినట్లు చెప్పింది. ఇది 8.33 శాతం బోనస్, 11.67 శాతం ఎక్స్‌గ్రేషియాకు సమానమని చెప్పింది. అదేవిధంగా.. కేరళ ప్రభుత్వం కూడా గతేడాది కూడా ఓనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ. 4 వేల బోనస్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. బోనస్‌కు అర్హత లేని ఉద్యోగులకు పండగ భత్యం కింద రూ.2,750 ఇవ్వనున్నారు. Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు Also Read: TTD: ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు..అంతా బాబాయి చలవే!