జైళ్లలో కుల వివక్ష ఏంటి.. సుప్రీంకోర్టు ఆగ్రహం
జైళ్లలో కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం లాంటి పనులు అప్పగిస్తున్నారని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వివక్ష చూపించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని మండిపడింది . 11 రాష్ట్రాలకు దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.