Supreme Court: ప్రార్థనా స్థలాలపై ఎన్నాళ్ళు...ఇక చాలు అన్న సుప్రీంకోర్టు

ప్రార్థనా స్థలాల విషయంలో ఇంకెన్నాళ్ళు పిటిషన్లు వేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేంద్రం కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. ఇలాంటి పిటిషన్లకు ముగింపు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.

New Update
Supreme Court

Supreme Court

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ఏ ప్రార్థనా స్థలమైనా అలాగే కొనసాగేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. కానీ దీని చెల్లుబాటును హిందూ పక్షాలు సవాల్ చేశాయి. తాజాగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద మళ్ళీ పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ జరిగింది చాలు...ఇలాంటి పిటిషన్లకు ముగింపు ఉండాలి అని వ్యాఖ్యానించింది. కొత్త పిటిషన్లను ఇంక విచారించమని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. అయితే అదనపు అంశాలను కలిపి కొత్త పిటిషన్లు దాఖలు చేయవచ్చని మాత్రం చెప్పారు. 

వరుసపెట్టి పిటిషన్లు...

దేశంలో చాలాచోట్ల హిందూ దేవాలయాలు, మసీదుల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. అయోధ్య వివాదం దగ్గర మొదలైనవి ఇవి..కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపీ, శ్రీకృష్ణ జన్మస్థలం- మధుర ఈద్గావ్, తాజాగా శంభాల్ దర్గా ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌, మజ్లిస్‌తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు ప్రార్థనా స్థలాల చట్టం 1991ను కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. 

Also Read: Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు