Supreme Court: ఆ మాటలు అసభ్యంగా లేవా.. యూట్యూబర్‌ పై సుప్రీం కోర్టు సీరియస్‌!

అల్లాబ‌దియాపై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. అతను మాట్లాడిన మాట‌లు అస‌భ్య‌క‌రంగా లేవా అని ప్ర‌శ్నించింది. స‌మాజానికి విలువలు ఉన్నాయ‌ని, ఏదిప‌డితే అది మాట్లాడ‌డం స‌రికాదు అని కోర్టు పేర్కొంది.

New Update
Supreme Court

Supreme Court

యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్స‌ర్‌ (YouTube Influencer) ర‌ణ్‌వీర్ అల్లాబ‌దియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది . యూట్యూబ్ షో కోసం అత‌ను వాడిన భాష‌ పై  అత్యున్న‌త న్యాయ‌స్థానం మండిపడింది. స‌మాజానికి కొన్ని విలువ‌లు ఉన్నాయ‌ని కోర్టు పేర్కొన్న‌ది. అల్లాబ‌దియా మదిలో చెడు ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని, వాటిని అత‌ను యూట్యూబ్ షోలో క‌క్కేశాడ‌ని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొన్న‌ది. జ‌స్టిస్ సూర్య కంత్‌, జ‌స్టిస్ కోటీశ్వ‌ర్ సింగ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ అల్లాబ‌దియా కేసులో ఈ సంచలన వ్యాఖ్య‌లు చేసింది.

Also Read: water wastage : అలెర్ట్.. కార్లు కడిగితే రూ. 5 వేల ఫైన్.. రిపీట్ చేస్తే వాచిపోద్ది!

స‌మాజానికి ఉన్న విలువ‌లు, వాటి ప‌రిమితిలు నీకు తెలుసా అంటూ కోర్టు అత‌న్ని ప్ర‌శ్నించింది. స‌మాజానికి కొన్ని విలువ‌లు ఉన్నాయ‌ని, వాటిని గౌర‌వించ‌డం నేర్చుకోవాల‌ని కోర్టు చెప్పింది. భావ‌స్వేచ్ఛ పేరుతో.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌డం స‌రికాదు అని కోర్టు చెప్పింది. స‌మాజ విలువ‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవ‌రికీ లేదంటూ కోర్టు తెలిపింది. నీవు మాట్లాడిన తీరుతో కూతుళ్లు, సోద‌రీమ‌ణులు, పేరెంట్స్‌, స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకుంటోంద‌ని యూట్యూబ‌ర్ అల్లాబ‌దియాపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Also Read: Drawing: భార్యను చంపిన భర్త... పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!

Supreme Court Serious On YouTuber

నువ్వు మాట్లాడిన మాటలు అస‌భ్యం, అశ్లీలం కాదా, ఎందుకు నీపై న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌ల‌ను ఒక్క‌టి చేయాలి, వాటిని ఎందుకు కొట్టివేయాల‌ని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో యూట్యూబ‌ర్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే, అప్పుడు నిన్న చూసి జ‌నం ప‌బ్లిసిటీ కోసం ఇత‌రుల్ని బెదిరించే అవ‌కాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.

ఓ యూట్యూబ్ షోలో.. పేరెంట్స్ సెక్స్ గురించి ర‌ణ్‌వీర్ అల్లాబ‌దియా అభ్యంతరకర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అత‌నిపై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ అత‌నికి కానీ, అత‌ని కుటుంబానికి కానీ ప్రాణ‌హాని బెదిరింపులు వ‌స్తే, అప్పుడు అత‌ను పోలీసుల్ని ఆశ్ర‌యించ‌వ‌చ్చు అని కోర్టు చెప్పింది. అల్లాబ‌దియాపై కొత్త‌గా ఎటువంటి కేసులు న‌మోదు చేయ‌వ‌ద్దు అని కోర్టు తెలిపింది.

Also Read: Cricket : టీమ్‌ ఇండియాకు బిగ్ షాక్.. తండ్రి మరణంతో స్వదేశానికి..

Also Read: AP: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు