/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
Supreme Court
యూట్యూబ్ (YouTube) లాంటి ఆన్ లైన్ వేదికల్లో అస్సలు నియంత్రన ఉండటం లేదని... దీన్ని యూ ట్యూబర్లు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. యూట్యూబ్ కు ఎటువంటి పరిమితులు లేకపోవడం వలన యూట్యూబర్లు ఇష్టారాజ్యంగా నిర్వహించే కార్యక్రమాల్లో అన్నీ చెల్లుబాటవుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని, త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.
Also Read: J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో..వాతావరణశాఖ
Also Read : ప్రయాగ్‌రాజ్ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన!
అతని అంశం చాలా సున్నితమైనది..నిర్లక్ష్యం చేయం..
అలాగే యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా కేసును సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. అది అత్యంత సున్నితమైన అంశమని...దానిని నిర్లక్ష్యం చేయమని చెప్పింది. యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్సర్ (YouTube Influencer) రణ్‌వీర్ అల్లాబదియాపై నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . యూట్యూబ్ షో కోసం అతను వాడిన భాష పై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. అల్లాబదియా మదిలో చెడు ఆలోచనలు ఉన్నాయని, వాటిని అతను యూట్యూబ్ షోలో కక్కేశాడని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొన్నది. జస్టిస్ సూర్య కంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ అల్లాబదియా కేసులో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. భావస్వేచ్ఛ పేరుతో.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు అని కోర్టు చెప్పింది. సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదంటూ కోర్టు తెలిపింది. నీవు మాట్లాడిన తీరుతో కూతుళ్లు, సోదరీమణులు, పేరెంట్స్, సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని యూట్యూబర్ అల్లాబదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: USA: అమెరికా నుంచి పనామాకు అక్రమవలసదారులు..భారతీయులు కూడా
Also Read : నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!
Follow Us