Supreme Court: మీరు విదేశాలకు వెళ్తే తిరిగొస్తారన్న నమ్మకం లేదు..ఇంద్రాణీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆమె పిటిషన్‌ వేసింది. ఈ క్రమంలో మీరు విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ కోర్టుకి లేదని అంది.

New Update
Supreme Court

Supreme Court

షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. కొంతకాలం క్రితం ఆమె  విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. మీరు విదేశాలకు వెళ్తే తిరిగి వస్తారనే నమ్మకం మాకు లేదంటూ సుప్రీం కోర్టు చెప్పుకొచ్చింది. ఈక్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అలాగే ఈ కేసును ఏడాది లోగా పూర్తి చేయాలంటూ ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.

Also Read: China:కరోనా పై ఆ పరిశోధనలు చేయలేదంటున్న చైనా!

ముంబై మెట్రో వన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే 25 ఏళ్ల షీనా బోరా 2012 ఏప్రిల్ 24వ తేదీన అతి కిరాతకంగా నిందితులు హత్య చేశారు. అయితే ఈ కేసులో ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీతో పాటు షీనా మారు తండ్రి పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ సుందర్ రాయ్‌ను ముంబయి పోలీసులు 2015 ఆగస్టులో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. షీనాను అపహరించి హత్య చేశారన్న నేరాలు వారిపై మోపారు. అయితే ఈ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ ప్రధాన నిందితురాలు కాగా.. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు.

Also Read: Hyderabad Metro: మెట్రో ఛార్జీల సవరణకు కసరత్తు!

తిరిగి వస్తారన్న గ్యారంటీ...

అయితే 2022వ సంవత్సరంలో సుప్రీం కోర్టు ఇంద్రాణీ ముఖర్జీకి షరతులో కూడిన బెయిల్ ఇచ్చింది. ముఖ్యంగా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపరాదని తేల్చి చెప్పింది మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్న ఇంద్రాణీ ముఖర్జీ.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ ట్రయల్ కోర్టులో ఇటీవలే పిటిషన్ వేశారు. జులై 19వ తేదీన విచారణ జరిపిన కోర్టు స్పెయిన్, యూకే వెళ్లేందుకు 10 రోజులు అనుమతి ఇచ్చింది. కానీ సీబీఐ అప్పీల్‌తో బాంబే హైకోర్టు.. అనుమతిని నిరాకరిస్తూ తీర్పు వెల్లడించింది.

దీంతో ఇంద్రాణీ ముఖర్జీ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈక్రమంలోనే విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నిందితురాలికి గట్టి షాక్ ఇచ్చింది. మీరు విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ కోర్టుకి లేదని తేల్చి  చెప్పింది. అలాగే విచారణ తుది దశకు చేరుకుందని.. విచారణ కొనసాగుతున్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకున్నామని వివరించింది. అందుకే ఈ సమయంలో మీకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంది. అంతేకాకుండా విచారణను వేగవంతం చేసి ఏడాది లోగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.

Also Read:Goutham Aadani: జీత్‌ వెనుక ఉన్న నిజమైన శక్తి ఎవరో తెలుసా అంటున్న గౌతమ్‌ అదానీ!

Also Read: horoscope Today: ఈ రాశి వారు ఈరోజు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు