USA: ముంబై పేలుళ్ళ నిందితుడు  తహవూర్ రాణా అప్పగింతలో ట్విస్ట్...మరింత ఆలస్యం

ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడం మరింత ఆలస్యం కానుంది. తనను బారత్ కు అప్పగించడంపై రాణా మళ్ళా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీని తీర్పు వచ్చేవరకు అతని అప్పగింత సాధ్యం కాదు.

New Update
usa

Mumbai 26/11 Accused Tahvur Rana

ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. రెండు రోజుల క్రితం మోదీ అమెరికా పర్యటనలో దీన్ని కన్ఫామ్ కూడా చేశారు. దీని ప్రకారం వీలైనంత తొందరగా తహవూర్ రాణాను భారత్ కు అప్పగించాలి. అయితే ఈ అప్పగింత మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఈ పిటిషన్‎పై తీర్పు వెలువడే వరకు రాణా అప్పగింత సాధ్యం కాదు. తనను విచారణ కోసం భారత్‎కు అప్పగించడాన్ని ఇప్పటికే ఓ సారి రాణా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ పిటిషన్‎ను తిరస్కరించింది. ఈ తీర్పు మీదనే రాణా ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేశాడు. దీని జడ్జిమెంట్ వచ్చేవరకు అతనిని భారత్ కు తరలించరు. 

ముంబై దాడుల కీలక సూత్రధారి..

ముంబై తాజ్ మహల్ హోటెల్ దాడిని ఎన్ని ఏళ్ళయినా ఇండియా మర్చిపోలేదు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొంత మంది అప్పుడే ఘటన సమయంలో చనిపోగా...కసబ్ ను అరెస్ట్ చేశారు. ఇతనికి భారత కోర్టు ఉరిశిక్ష విధించింది. అది అమలు అయింది కూడా. అయితే ముంబై దాడులుకు కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా మాత్రం అమెరికా లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఇతన్ని అప్పగించాలని భారత్ చాలాకాలంగా పోరాడుతోంది. అయితే దీన్ని తహవూర్ రాణా చాలా సార్లు ప్రయత్నించాడు. అక్కడి ఫెడరల్ కోర్టుల్లో చాలా సార్లు పిటిషన్ వేశాడు. ఆ కోర్టులన్నీ అతని అభ్యర్థనను తిరస్కరించాయి.  శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరిసారి గా  గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు తహవూర్ రాణా. అయితే ఈ పిటిషన్ ను కట్టేయాలని కోర్టును అమెరికా ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి 20 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అమెరికా ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది.

Also Read: AP: తెలుగు జాతి ఉన్నంతవరకూ ఎన్టీయార్ ట్రస్ట్ ఉంటుంది..సీఎం చంద్రబాబు

Advertisment
తాజా కథనాలు