/rtv/media/media_files/2025/06/01/kDK5QOkKBf1n21gKAHpq.jpg)
Flood Water Into Srisailam Project
Srisailam : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న1,30,780 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలకు చేరుకుంది. వర్షాకాలం కావడంతో వరదా ప్రవాహం క్రమంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read : టెక్సాస్‌లో వరదల బీభత్సం..43 మంది మృతి.. 23 మంది బాలికల గల్లంతు
ప్రమాదంలో ఆనకట్ట ?
ఇక శ్రీశైలానికి వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు సామార్ధ్యాన్ని పరిశీలించడానికి గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు శ్రీశైలం కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్‌గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. గేటు నుంచి నీటి లీకేజీ 10శాతం కంటే తక్కువగా ఉందన్న ఆయన రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని అక్కడి అధికారులకు సూచించారు.
Also Read : ఈ ఒక్క రొట్టె తింటే పెళ్లి ఖాయం! నెల్లూరులో రొట్టెల జాతర
ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ మరో ఐదేళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సూచించారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్ ఉందని, దాని వల్ల శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదని కన్నయ్య నాయుడు వెల్లడించారు.
Also Read : బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!