Sangareddy : రెచ్చిపోయిన మందుబాబులు... ఏకంగా ఎస్సైని ఢీకొట్టి..

సంగారెడ్డి జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. డ్రంకెన్‌ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్సై నాగలక్ష్మిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి తీవ్రగాయాలు కాగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.  పఠాన్‌చెరులో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు.

New Update
si nagalakshmi

si nagalakshmi

సంగారెడ్డి జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు.  డ్రంకెన్‌ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్సైని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎస్సై నాగలక్ష్మికి తీవ్రగాయాలు కాగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.  పఠాన్‌చెరులో ఎస్సై నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం రోజున డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. అయితే పోలీసులను చూసి ఆపకుండా కారులో దూసుకు వెళ్లారు మందుబాబులు. దీంతో ఎస్సై నాగలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారి కారును ఛేంజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.  

Advertisment
తాజా కథనాలు