/rtv/media/media_files/2025/05/19/SozvfHU7rWRbzCqd2sLU.jpg)
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. అదుపు తప్పడంతో పిల్లల పైకి కారు వెళ్లింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కాతమ్ముడు మైదానంలో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడిపిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పిల్లాడి తండ్రి శేఖర్ ఫిర్యాదుతో యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహేశ్వరి, రవిశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారు నేర్చుకుంటూ ఇద్దరు చిన్నారులను ఢీకొట్టిన యువతి!
— The Bharat (@TheBharat_News) May 19, 2025
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం నర్రెడ్డిగూడెంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న యువతి ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులను ఢీకొట్టింది.
ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అక్కడికక్కడే మృతి చెందగా, 14 ఏళ్ల ఏకవాణికి తీవ్ర గాయాలయ్యాయి.… pic.twitter.com/noNbLQqMhZ
నంద్యాల జిల్లాలో కారు బోల్తా
ఏపీలో నంద్యాల జిల్లాలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన సంతోష్(47), లోకేశ్ (37), నవీన్ (37)గా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం, మహానంది ఆలయాలు దర్శించుకుని డోన్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
car-accident | sangareddy | medak | telugu-news