మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!

పాముకాటు మరణాలలో భారత్‌ ప్రపంచంలోనే టాప్‌లోనే ఉంది. దాదాపు ఏటా 30 లక్షల మంది పాముకాటుకు గురి అవుతుండగా.. వీరిలో సుమారు 58,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
snake6

Snakes

Snakes: పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. అంటే పాము కాటేసిన వెంటనే చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే ప్రాణాలే పోతాయ్. అయితే దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలే ప్రజల చావులకు కారణమవుతున్నాయి. పాము కాటు తర్వాత చికిత్స విషయంలో ఇప్పటికీ పలు గ్రామాల ప్రజలు మూఢనమ్మకాలనే అనుసరిస్తున్నారు. పాము కాటు తర్వాత బాధిత వ్యక్తిని గంగానదిలో ముంచితే అతని శరీరంలో నుంచి విషం పోతుందనే భావన ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో కనిపిస్తోంది. హాపూర్ జిల్లా- సదర్‌పూర్ గ్రామంలో పాము కాటు తర్వాత బాధితులను గంగానదిలో ముంచుతారు. 

గంటల పాటు నీటిలో..

బులంద్‌షహర్‌లోని జహంగీరాబాద్ పట్టణంలో మోహిత్ కుమార్‌ అనే వ్యక్తిని పాము కాటేసింది. దీంతో అతని కుటుంబ సభ్యులు మోహిత్ మృతదేహాన్ని గంగా నదిలో ముంచారు. అక్కడ వరద ఉధృతికి మోహిత్ కుమార్‌ శరీరంలో నుంచి విషం బయటకు పోతుందని భావించారు. గంటల పాటు నీటిలో అతని కాళ్లు నానుతూనే ఉన్నాయి. చివరికు మోహిత్ చనిపోయాడు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఇష్టమైన పండు..ఇది తింటే రోగాలు పరార్‌


 ఇలాంటి మూఢనమ్మకాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల్లో పాము కాటుకు ప్రజలు మరణించడం సర్వసాధారణంగా మారిపోయింది. పాము కాటేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ప‌ర్వత‌ ప్రాంతాల్లోని ఆవు పేడ‌ల‌ను తీసుకొచ్చి అందులో బాధితులను పూడ్చిపెడతారు. ఆవుపేడ‌లో అనేక ఔష‌దాలు ఉంటాయని, పాముకాటు నుంచి విషాన్ని బ‌య‌ట‌కు లాగేస్తుంద‌ని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఇలా ఆవుపేడ‌తో బాధితుల శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పడం కారణంగా వారు ఊపిరాడ‌క చనిపోతుంటారు. నిజానికి పాముకాటు మరణాలలో భారత్‌ ప్రపంచంలోనే టాప్‌లోనే ఉంది. దాదాపు 30 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. వీరిలో సుమారు 58,000 మంది ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: ఎన్నిసార్లు స్నానం చేసినా ఈ భాగాల్లో వాసన పోదు

 

ఇది కూడా చదవండి:  తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

ఇది కూడా చదవండి:  విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

Advertisment
Advertisment
తాజా కథనాలు