/rtv/media/media_files/2025/08/02/girl-carries-snake-bitten-mother-for-5-kilo-metres-due-to-poor-roads-in-odisha-2025-08-02-16-45-39.jpg)
Girl Carries Snake Bitten Mother For 5 kilo metres Due To Poor Roads in odisha
సాధారణంగా ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుంటారు. ఒకవేళ సరైన రోడ్డు మార్గం లేకుంటే వాళ్లని తీసుకెళ్లడం కష్టమవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉండేవాళ్లకు ఇలాంటి పరిస్థితులు తరచుగా ఎదురవుతుంటాయి. తాజాగా ఒడిశాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కాటేసింది. దీంతో తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూతురు తీవ్రంగా శ్రమించింది. ఆమెను తన వీపుపై ఎక్కించుకుని 5 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తల్లికి సకాలంలో చికిత్స అందలేదు. దీంతో ఆమె మరణించింది. ఆ కూతురు తల్లిని వీపుపై మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ରାସ୍ତା ନଥିବାରୁ ଜୀବନ ଗଲା। ତୁମୁଡିବନ୍ଧ ବ୍ଲକ ମୁଣ୍ଡିଗୁଡା ପଞ୍ଚାୟତର ଘଟଣା। ସାପ କାମୁଡି ଦେଇଥିବା ଗୁରୁତର ମାଆଙ୍କୁ ନିଜ ପିଠିରେ ୫ କିଲୋମିଟର ବୋହିନେଲା ଝିଅ। ସେଠାରୁ ବାଇକରେ ପୁଣି ୩ କିଲୋମିଟର ନେଲା ପରେ ଆମ୍ବୁଲାନ୍ସରେ ହସ୍ପିଟାଲ ଗଲେ। ପହଞ୍ଚିଲା ବେଳକୁ ବହୁତ ଡେରି ହେଇସାରିଥିଲା। ଖଟିଆରେ ମୃତଦେହ ନେଇ ଫେରିଲେ। #odisha… pic.twitter.com/PtT9aV5cyh
— Odisha Reporter (@OdishaReporter) August 2, 2025
Also Read: బరితెగించింది.. భర్తను బతికుండగానే పాతిపెట్టాలని చూసింది... డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!
Girl Carries Snake Bitten Mother
ఇక వివరాల్లోకి వెళ్తే.. కంధమాల్ జిల్లాలోని మారుమాల ప్రాంతమైన డుమెరిపడ గ్రామంలో బలమదు మాఝి అనే మహిళ తన పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రించగా పొదల్లోంచి వచ్చిన పాము కాటేసింది. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ డుమెరిపడ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. అందువల్ల ఆ ఊరికి 8 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే అంబులెన్స్ వచ్చింది.
ఇక చేసేదేమి లేక ఆ తల్లి కూతురు రజని తన వీపుపై ఆమెను ఎక్కించుకుంది. అటవీ మార్గంలో ఐదు కిలోమీటర్ల వరకు మోసుకెళ్లింది. వారి వెంట బంధవులు కూడా వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు తల్లిని బైక్‌పై తీసుకెళ్లి అంబులెన్స్ ఉన్న ప్రాంతానికి చేరుకుంది. ముందుగా ఆ తల్లిని తుముడిబంద్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి బలిగూడ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమెకు వైద్యం సకాలంలో అందలేదు. ఆలస్యం జరగడం వల్ల ఆ తల్లి మరణించింది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని మంచంపై గ్రామానికి తన పిల్లలు మంచంపై మోసుకెళ్లారు.
ఇదిలాఉండగా వాళ్ల కుటుంబంలో గతంలో ఇలాంటి ఘటనే జరిగింది. వాళ్ల తండ్రికి కూడా సకాలంలో చికిత్స అందకపోవడంతో ఆయన మృతి చెందారు. తాజాగా తల్లిని కూడా పోగొట్టుకున్నారు. దీంతో డుమెరిపడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామానికి రోడ్డు మార్గం వేయించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఇలా సరైన సమయంలో వైద్యం అందక చాలామందికి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 310 ఏళ్లుగా అదే రుచి.. అదే నాణ్యత.... తిరుపతి లడ్డు మొదట ఎలా ఉండేదంటే..?
telugu-news | rtv-news | snake-bite | national news in Telugu | latest-telugu-news