నిద్రలేమి నుంచి విముక్తి పొందాలంటే?
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు మొబైల్‌కి దూరం, మెడిటేషన్ చేయడం, పుస్తకాలు చదవడం, డైలీ ఒకే సమయానికి నిద్రపోవడం వంటివి చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతారు. వెబ్ స్టోరీస్
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు మొబైల్‌కి దూరం, మెడిటేషన్ చేయడం, పుస్తకాలు చదవడం, డైలీ ఒకే సమయానికి నిద్రపోవడం వంటివి చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతారు. వెబ్ స్టోరీస్
నిద్ర శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందరూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. లేకపోతే మెదడుపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి వల్ల మధుమేహం, ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడితోపాటు ఆకలిని నియంత్రించే హార్మోన్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ, తక్కువ నీరు తాగటం వల్ల నిద్ర పాడవుతుంది. ప్రతి వ్యక్తి రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి. సరైన మొత్తంలో నీరు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి ఆరోగ్యాన్ని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
చాలా మంది రాత్రిపూట తగిన సమయంలో నిద్రపోకపోవటంతో అనారోగ్యపాలవుతున్నారని నిపుణులు అంటున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఏ వయసు వారు రోజుకు ఏ సమయంలో నిద్రించాలో చెబుతున్నారు. వారు చెప్తున్న సమయమేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
రాత్రిపూట స్నానం చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. రాత్రిపూట శరీర ఉష్ణోగ్రత నిద్రకు అనుకూలంగా ఉంటుంది. అలాంటి సమయంలో స్నానం చేయడం ద్వారా ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.
రాత్రి సమయంలో తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. తిన్న వెంటనే నిద్రపోవడం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా బరువు పెరగడం, యాసిడ్ రిఫ్లక్స్ ,గుండెల్లో మంట, గ్యాస్ ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మీరు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్నట్లయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. రాత్రిపూట షిఫ్టుల్లో పని చేయడం వల్ల ఊబకాయం, మధుమేహం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
దీర్ఘకాలం స్లీపింగ్ డిజార్డర్లతో బాధపడుతుంటే రక్తపోటు, డిప్రెషన్, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి నిద్రకు ఆటంకం కలిగించే సమస్యలను పరిష్కరించడం ముఖ్యం.దీనికి సంబంధించిన ముఖ్యవిషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.