China: నిద్ర పోయాడు..ఉద్యోగం నుంచి పీకేశారు..కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే! 20 సంవత్సరాలుగా పని చేస్తున్న కంపెనీ ఓ గంట నిద్రపోయినందుకు విధుల నుంచి ఓ ఉద్యోగిని తొలగించింది. అయితే అది పెద్ద నేరం కాదని ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు అతనికి మద్దతుగా నిలవడంతో పాటు అతనికి 40 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. By Bhavana 25 Nov 2024 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి China: డ్యూటీ టైమ్ లో కునుకు తీసిన ఉద్యోగిని తొలగించిందో కంపెనీ. అది పెద్ద తప్పు కాదు నాకు న్యాయం చేయాడంటూ ఆ ఉద్యోగి ఏమో కోర్టును ఆశ్రయించాడు.దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం అతని వాదనకు మద్దతు తెలిపింది. 3.5 లక్షల యువాన్లు (దాదాపు రూ. 40.78 లక్షలు) పరిహారంగా ఇవ్వాలని సదరు కంపెనీకి ఆదేశాలిచ్చింది. ఈ సంఘటన చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్లో జరిగిందీ. Also Read: OU: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన వీసీ ఓ కెమికల్ కంపెనీలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఝాంగ్కు మంచి పేరే ఉంది. ఇటీవల విధుల్లో ఉండగా అలసిపోయి తన డెస్క్పైనే ఓ కునుకు తీశాడు. అది కాస్తా అక్కడున్న సీసీటీవీ కెమెరాకు చిక్కడంతో కంపెనీ హెచ్ఆర్ విభాగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. విధుల్లో ఉండగా దాదాపు గంటపాటు నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు హెచ్ఆర్ విభాగం నుంచి వచ్చిన నోటీసు చూసి ఝాంగ్ నివ్వెరపోయాడు. Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు విధుల్లో నిద్రపోవడం అంటే కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందికే వస్తుందని నోటీసుల్లో చెప్పింది.ఉద్యోగం కోల్పోయిన ఝాంగ్.. తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. నిద్రపోయినందుకు ఇంత దారుణమైన శిక్ష ఉంటుందా? అని తీవ్రంగా వాదించాడు. వాదనల అనంతరం కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అతడి కునుకు వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని చెప్పింది. Also Read: Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం! కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగించే హక్కు కంపెనీకి ఉంటుందని, కానీ ఇక్కడ అతడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సమర్థించే కారణాలు ఏవి లేవని తెలిపింది. విధుల్లో ఉండగా నిద్రపోవడం అతడికి ఇదే తొలిసారని, దీనివల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదని వివరించింది. కాబట్టి ఝాంగ్ను అకారణంగా తొలగించినందుకు రూ. 40.78 లక్షల పరిహారం చెల్లించాలని టైజింగ్లోని పీపుల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. Also Read: Pushpa2 స్టేజీపైనే నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ #sleep #china #employee #sleeping at work #Court Taixing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి