/rtv/media/media_files/2025/12/05/shashi-tharoor-2025-12-05-18-51-23.jpg)
Shashi Tharoor Gets Invite To Attend President’s Banquet For Putin
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ ఆహ్వానం రాలేదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు మాత్రం ఈ విందు ఆహ్వానం అందింది. దీనిపై ఆయన కూడా స్పందించారు. అయితే రాహుల్ గాంధీని ఆహ్వానించని విషయం తనకు తెలియదని తెలిపారు. కానీ తాను మాత్రం తప్పకుండా హాజరవుతానని పేర్కొన్నారు.
Also Read: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !
అంతేకాదు కేంద్రం ఏ ప్రాతిపదికన తనను విందుకు ఆహ్వానించారనే విషయం కూడా తెలియదని చెప్పారు. ఇదిలాఉండగా ఇటీవల ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు బ్రీఫింగ్ ఇచ్చేందుకు విదేశాలకు పంపించిన టీమ్‌లలో శశిథరూర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల పలు సందర్భాల్లో కేంద్రానికి, ప్రధాని మోదీకి సపోర్ట్ చేస్తూ శశిథరూర్ మాట్లాడారు. దీంతో సొంత పార్టీ నుంచే ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో ఐక్యరాజ్యసమితిలో థరూర్ దౌత్యవేత్తగా కూడా విధులు నిర్వహించారు. దీంతో రష్యా అధికారులతో ఆయనకు కూడా అనుబంధం ఉందని.. అందుకే విందుకు ఆహ్వానం అందినట్లు సమాచారం.
Follow Us