/rtv/media/media_files/2025/09/04/shashi-tharoor-2025-09-04-16-11-20.jpg)
Shashi Tharoor
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ టారిఫ్ వార్‌ను ముగించాలని సూచనలు చేశారు. ట్రంప్ భారత్‌ను దూరం చేసుకుంటే క్వాడ్ కూటమి బలహీనపడిపోతుందని హెచ్చరించారు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఈ అంశాలను థరూర్ ప్రస్తావించారు. టారిఫ్‌ల ప్రభావం వల్ల ప్రాంతీయ భద్రతలో అస్థిరత ఏర్పడుతుందని.. అలాగే అమెరికా వ్యతిరేక కూటమైన రష్యా, చైనాకు భారత్ దగ్గరవుతుందని పేర్కొన్నారు. వ్యూహాత్మక స్వతంత్ర వైఖరి అనేది సార్వభౌమాధికారమని అమెరికా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Also Read: మోదీతో కారులో మాట్లాడిన సీక్రెట్ లీక్ చేసిన పుతిన్
'' ఇండియా కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు. ఇండో పసిఫిక్‌లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. భారత్‌ను దూరం చేసుకుంటే క్వాడ్ బలహీనపడే ఛాన్స్ ఉంటుంది. త్వరలో భారత్ ఈ కూటమి సదస్సును నిర్వహించనుంది. ఏ దేశమైనా కూడా తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటోంది. తమ ఇంధన సరఫరాదారులను ఎంపిక చేయడంలో లేదా ఆయుధ ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్‌పై టారిఫ్‌లతో శిక్షించడం కరెక్ట్ కాదు. ఇది చాలావరకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని'' శశిథరూర్ అన్నారు.
Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!
అంతేకాదు అమెరికా-భారత్ సంబంధాలు మెరుగుపరేందుకు ఆయన కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. భారత్ లేబర్ మార్కెట్‌ను ప్రభావితం చేసేలా ఉన్న టారిఫ్‌లను తొలగించడం, ఇరు దేశాల మధ్య చర్చలను వేగవంతం చేయడం, అత్యున్నత స్థాయిలో దౌత్యాన్ని వేగవంతం చేయడం లాంటి విధానాలు పాటించాలని సూచనలు చేశారు. దీనికన్నా ముందు థరూర్ అల్ అరేబియా ఇంగ్లిష్‌తో కూడా మాట్లాడారు. భారత్ 200 ఏళ్ల పరాయి పాలనను మర్చిపోయి విధానాల తయారీలో విదేశీ జోక్యానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. భారత్‌పై ఇలా టారిఫ్‌లు విధించడం అన్యాయని హితువు పలికారు.
And for those who prefer the newspaper itself! https://t.co/pF6kJHS5E6pic.twitter.com/ZwJTYET1OT
— Shashi Tharoor (@ShashiTharoor) September 4, 2025
Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!