/rtv/media/media_files/2025/05/13/OTovQcZT1whlOgzhCOJV.jpg)
Shashi Tharoor lauds PM Modi on India- Pakistan conflict
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించామని చెప్పారు. పాకిస్థాన్ తాము ఏదో సాధించినట్లు చెప్పుకుంటోందని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also Read: అది చేయకుంటే కాల్పుల విరమణ ఆగిపోతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్
'' ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అంతా చూశాం. పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రిగా మోదీ ఏం చేయాలో ఆ పని చేస్తున్నారు. ప్రత్యేక సంక్షోభ సమయంలో మోదీ వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. కోవిడ్ లాంటి మహమ్మారి అయిన దేశద్రోహులపై మోదీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేని. దేశానికి ఏది ముఖ్యమో అది ప్రధానిగా మోదీ చేస్తున్నారని'' శశిథరూర్ కొనియాడారు. ఇకపై ప్రధాని ఇలావే వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ఒక్క ఫొటోతో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..
భారత్, పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ అధంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. పాక్‌కు చుక్కలు చూపించి.. ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని మోదీ ప్రశంసించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు. మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ సమయాల్లో దీన్ని నిరూపించామని.. తాజాగా ఆపరేషన్ సిందూర్‌తో దాన్ని మరోసారి స్పష్టం చేశామని తెలిపారు.
shashi-tharoor | mp-shashi-tharoor | telugu-news