Shashi Tharoor: కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు.. పార్టీపై శశిథరూర్‌ తీవ్ర అసంతప్తి!

కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్‌ ప్రధాని మోదీ, సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని పొగడంతో కాంగ్రెస్ ఆయన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో శశిథరూర్‌ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

New Update
MP Shashi Tharoor

MP Shashi Tharoor

కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్.. పార్టీలో తన పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ఇటీవల శశిథరూర్‌ ఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిశారు. పార్టీలో తనను పక్కన పెట్టడం, ముఖ్యంగా పార్లమెంటులో కీలకమైన డిబేట్‌లలో పాల్గొనేలా అవకాశం ఇవ్వకం పోవడం వంటి అంశాల గురించి రాహుల్‌కు చెప్పారు. కానీ రాహుల్‌గాంధీ.. శశీథరూర్‌ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని అందుకే శశిథరూర్‌ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.   

Also Read: మహా కుంభమేళా రికార్డు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. శశీథరూర్ రాహుల్‌ గాంధీతో సమావేశమైనప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్‌ వైఖరికి ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం తనకుందని చెప్పారు. తాను రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలా ? లేదా తనకేదైనా మరో బాధ్యతను ఇవ్వాలనుకున్నారా అనేదానిపై పార్టీ ఆదేశం ఇవ్వాలని కోరుతున్నారు. కేరళలో తనను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించాలని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ (AIPC) ఏమైనా ప్లాన్ చేసిందా అనేది కూడా థరూర్‌ తెలుసుకోవాలనుకుంటున్నారు. 2017లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ (AIPC)ని శశిథరూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సంస్థలో నుంచి తనను తొలగించడంపై శశీథరూర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల ప్రధాని మోదీ అమెరికా సందర్శనకు వెళ్లినప్పుడు ఆయన్ని శశిథరూర్‌ ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి శశిథరూర్‌ వైఖరిపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత థరూర్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ ప్రయోజనాల కోసమే ప్రతీసారి మాట్లాడలేమని అన్నారు. తాను పార్టీ ప్రతినిధిని కాదని.. ప్రజలు ఎన్నుకున్న ఎంపీనని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓ కీలకమైన వాటాదారుడిగా తాను మాట్లాడుతానని స్పష్టం చేశారు.  

Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్‌ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్‌!

 కేరళను ఆర్థిక ఆవిష్కరణకు మోడల్‌గా, స్థిరమైన అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని కూడా ప్రశంసిస్తూ ఆయన ఓ ఆర్టికల్ రాశారు. సీపీఐ(ఎం) ఈ ఆర్టికల్‌ను ప్రభుత్వ మంచి పనితీరుకు సర్టిఫికేట్‌గా కూడా ఉపయోగించుకుంది. అయితే ఈ ఏడాదిలో కేరళలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడి సర్కార్‌పై కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఇలాంటి తరుణంలో శశిథరూర్‌ అధికార ప్రభుత్వాన్ని పొగడటం పార్టీకి సహించడం లేదనే ప్రచారం నడుస్తోంది. అయితే తాను వాస్తవాలు, డేటా ఆధారంగానే ఈ ఆర్టికల్ రాసినట్లు శశిథరూర్‌ చెప్పుకొచ్చారు. అందుకే శశిథరూర్‌ను కాంగ్రెస్‌ పక్కనపెడుతోందని తెలుస్తోంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు