Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇక ఇంటికే!

ట్రావెన్‌కోర్ దేవస్థానం ప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా భక్తులు శబరిమల వెళ్లకుండానే భక్తులు తన ఇంటి నుంచి ప్రసాదాలు బుక్ చేసుకోవచ్చు.

New Update
Sabarimala

Sabarimala

కేరళ(kerala) లో ఉన్న శబరిమల(sabarimala) ఆలయానికి భక్తులు భారీగా వెళ్తుంటారు. 41 రోజులు కఠినమైన దీక్షను నవంబర్ నుంచి జనవరి మధ్యలో చేపట్టి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఈ 41 రోజులు మాంసాహారం, మద్యం, బ్రహ్మచర్యం వంటి నియమాలు పాటిస్తుంటారు. నవంబర్‌లో ఈ యాత్ర ప్రారంభమై జనవరి 14న జరిగే మకరవిళక్కు (మకర సంక్రాంతి)తో పూర్తి అవుతుంది. ఈ రోజు మకరజ్యోతి దర్శనం భక్తులకు లభిస్తుంది. అలాగే ప్రతీ మలయాళ నెలలో మొదటి ఐదు రోజుల పాటు కూడా స్వామి దర్శనార్థం ఆలయాన్ని తెరుస్తారు.

ఇది కూడా చూడండి: దుర్గా దేవి నవరాత్రుల్లో మటన్, చేపలు.. ఎక్కడో తెలుసా?

ఆన్‌లైన్‌లోనే ప్రసాదం..

ఇక్కడ ఆలయం దేశవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందినదో.. ప్రసాదం కూడా అంతే ప్రత్యేకం. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే ట్రావెన్‌కోర్ దేవస్థానం ప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా భక్తులు శబరిమల వెళ్లకుండానే భక్తులు తన ఇంటి నుంచి ప్రసాదాలు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ అయ్యప్ప ప్రసాదం కోసం శబరిమల వెళ్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు. డైరెక్ట్‌గా ఆలయానికి వెళ్లి ప్రసాదం కొనుగోలు చేయలేని వారికి ఈ కొత్త వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో ఈ శబరిమల ప్రసాదాన్ని బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది.

ఇది కూడా చూడండి: PM Modi: మహిళలకు మోదీ అదిరిపోయే దసరా గిఫ్ట్.. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.10 వేలు!

ప్రస్తుతం శబరిమల ప్రసాదాల(Sabarimala Ayyappa Prasadam) కోసం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. త్వరలో ఈ వ్యవస్థను ట్రావెన్‌కోర్ సంస్థానం పరిధిలోని మొత్తం 1252 దేవాలయాలకు విస్తరించాలని దేవస్థానం బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇకపై ఈ సంస్థానం పరిధిలోని ఏ ఆలయ ప్రసాదాన్నైనా భక్తులు ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ వ్యవస్థ ఒక నెల రోజుల్లోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని దేవస్థానం బోర్డు అధ్యక్షులు తెలిపారు. భక్తులు తాము బుక్ చేసుకున్న ప్రసాదాలను కొరియర్ ద్వారా తమ ఇంటి అడ్రస్‌కు వస్తాయి. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భక్తులు ఆలయానికి వెళ్లకుండానే ప్రసాదం తీసుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు