Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Ayyappa Devotees Can Carry Irumudi On Flights Says Civil Aviation Ministry

Ayyappa Devotees Can Carry Irumudi On Flights Says Civil Aviation Ministry

అయ్యప్ప భక్తులకు(ayyappa-devotees) భారత పౌరవిమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని తన ఎక్స్‌లో ప్రకటించారు. '' శబరిమల(sabarimala) యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తులు నేరుగా విమానంలో ఇరుముడి(Irumudi)ని తీసుకెళ్లేలా పౌర విమానయాన మంతిత్వ శాఖ పర్మిషన్ ఇచ్చింది.

Also Read: దారుణంగా దేశ రాజధాని..సివియర్ ఎయిర్ పొల్యూషన్ తో నరకం

Ayyappa Devotees Can Carry Irumudi On Flights

ఇరుముడికి ఉన్న పవిత్రతను, భావోద్వేగాలను గౌరవిస్తూ.. భక్తుల సంప్రదయాలు, ఆచారాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలను గౌరవించేలా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని'' రామ్మోహన్ నాయుడు అన్నారు. 

Also Read: మావోయిస్టుల సంచలన ప్రకటన..జనవరి 1న సామూహికంగా లొంగిపోతాం

Advertisment
తాజా కథనాలు