Sabarimala: శబరిమల ఆలయంలో మరో గోల్డ్ స్కామ్.. అమూల్యమైన పవిత్ర దండం మిస్సింగ్!

శబరిమల ఆలయంలో మరో బంగారం స్కామ్ జరిగింది. గర్భగుడిలో ఉండాల్సిన పవిత్రమైన దండం మిస్ అయినట్లు తెలుస్తోంది. బంగారు పూత కోసం తీసుకెళ్లిన యోగదండం, ఏకముఖి రుద్రాక్ష మాల కనిపించడం లేదని, రికార్డుల్లో కూడా లేదని సమాచారం.

New Update
Sabarimala86

Sabarimala

శబరిమల ఆలయంలో మరో బంగారం స్కామ్ జరిగింది. గర్భగుడిలో ఉండాల్సిన పవిత్రమైన దండం మిస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది కొన్నేళ్ల కిందటే మిస్ కాగా.. తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. శబరిమల ఆలయంలో గర్భగుడిలో పురాతనమైన యోగదండం ఉండేది. బంగారు పూత కోసం దీన్ని 2018లో తీసుకెళ్లారు. ఆ తర్వాత కొత్తగా తయారు చేసిన యోగదండం తీసుకువచ్చారు. కానీ అసలైన యోగదండాన్ని మాత్రం ఇవ్వలేదు. దీన్ని మాయం చేశారు. ఆ తర్వాత ఈ యోగదండం వివరాలు కూడా తెలియవు. దీని పూర్తి వివరాలు కూడా ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్‌లో ఎంట్రీ కాలేదు. ఈ యోగదండంతో పాటు రుద్రాక్ష మాలకు కూడా బంగారు పూత పూయించేందుకు బయటకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఈ వస్తువులను ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ వస్తువులను తూకం వేయించినప్పుడు ఓ అధికారి వాటి వివరాలను నమోదు చేయలేదని సమాచారం.

ఇది కూడా చూడండి: Sad news : పంజాబీ నటుడు, బాడీ బిల్డర్‌ వీరేందర్‌ గుహ్‌మన్‌ మృతి...శోక సముద్రంలో పంజాబ్

అమూల్యమైన యోగదండం..

ఆ యోగదండం, రుద్రాక్షకు దేవస్థానం బోర్డు అధికారులు ఎంత బంగారం పూశారు? వెండిని మళ్లీ తిరిగి ఇచ్చారా? అనే పూర్తి వివరాలు కూడా బయటకు రాలేదు. ట్రావెన్ కోర్ దేవస్థానం కూడా వీటిని బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. వీటి బరువుకు సంబంధించిన రికార్డులు కూడా లేవు. అప్పటి నుంచి ఈ యోగదండం, రుద్రాక్ష మాల కనిపించకుండా పోయాయి. పురాతన కాలం నుంచి ఉన్న ఇవి సడెన్‌గా కనిపించకుండా పోయాయి.  అయితే ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఇవి ఎంతో ప్రత్యేకమైనవని తెలుస్తోంది. మండల మకరవిళక్కుతో పాటు నెలవారీ పూజలు, ప్రత్యేక సందర్భాలలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో అయ్యప్ప యోగనిద్రలో ఉంటారు. దీంతో ఆలయాన్ని మూసివేసే ముందు.. అయ్యప్ప వద్ద యోగదండం పెడతారు. ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాలను స్వామిని అలంకరిస్తారు. భస్మాభిషేకంతో విగ్రహాన్ని మూసివేస్తారు. సాధారణంగా ఏకముఖీ రుద్రాక్ష అనేది అత్యంత ఖరీదైనది. ఇప్పుడు కనిపించకుండా పోయింది.. ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాల. దీనికి తోడు ఇవి రెండు చాలా పురాతనమైనవి. వెలకట్టలేని యోగ దండం, రుద్రాక్ష మాల కనిపించకపోయే సరికి దర్యాప్తకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Illegal Betting Case : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు...కోట్లాది డబ్బు..కిలోలకొద్ది బంగారం..

Advertisment
తాజా కథనాలు