Breaking : రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం!
రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది. ఈసీ ఆదేశాల మేరకు ఈ కేబినేట్ మీటింగ్ లో అత్యవసర అంశాలు మాత్రమే చర్చించనున్నారు.
రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది. ఈసీ ఆదేశాల మేరకు ఈ కేబినేట్ మీటింగ్ లో అత్యవసర అంశాలు మాత్రమే చర్చించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫార్సులున్నాయనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అలాగే ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై మంత్రులతో కలిసి చర్చించారు.
ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. సోమవారం వరకు ఈసీ పర్మిషన్ ఇవ్వకపోతే.. మంత్రులతో కలసి ఢిల్లీకి వెళ్తామన్నారు. సీఈసీని కలిసి కేబినెట్ భేటీ కోసం అనుమతి తీసుకుంటామని చెప్పారు.
మహబూబ్ నగర్ ఎంపీగా తన గెలుపును ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించవని డీకే అరుణ అన్నారు. జిల్లా ప్రజలతో ఆయనకు సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓ చిల్లర మనిషన్నారు. ఆర్టీవీకి డీకే అరుణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
తెలంగాణ కేబినెట్ మీట్ ఈరోజు సాయంత్రం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ఉండడంతో మీటింగ్ పర్మిషన్ కోసం ఈసీని కోరింది ప్రభుత్వం. కానీ, ఇప్పటివరకూ అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది
రైతు రుణమాఫీ , ధాన్యం కొనుగోళ్ల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ నిర్వహించారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. చంద్రబాబు తనకు గురువు కాదని, తన సహచరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో షర్మిలను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పారు.
తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్న శంకరమ్మను ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు.
రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు.